Srujanee
"దేశవ్యాప్తంగా ఉన్న 749 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులలో, పదిలో తొమ్మిది మంది భారతీయులు తమ మాతృభాషలోనే చదవడానికి, వ్రాయడానికి మరియు భావాలు వ్యక్తపరచడానికి ఇష్టపడతారు.
సృజనీ దీనిని సుసాధ్యం చేస్తుంది."
మనకి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది, కానీ మనం ఇంటర్నెట్‌లో విదేశీ భాషతో భాషాపరమైన యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాము. ఎందుకు?
భారతదేశంలో 130 కోట్ల మంది భారతీయులు నివసిస్తున్నారు, అందులో దాదాపు 749 మిలియన్ ప్రజలు ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో డిజిటలైజేషన్ మరియు ఇంటర్నెట్ వ్యాప్తితో, చాలా మంది భారతీయులు ఇంటర్నెట్‌ని చురుకుగా అన్వేషించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారతదేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ వినియోగం సమానంగా ఉండబోతుందని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ వినియోగదారులలో చాలా మందికి ఇప్పటికీ ఇంటర్నెట్‌ని పూర్తి స్థాయిలో అన్వేషించడంలో సహాయం కావాలి. కారణం – భాషా అవరోధాలు. భారతదేశంలో అధికారిక భాషలుగా పరిగణించబడే 22 భారతీయ భాషలతో కలిపి భారతీయులు 780 భాషలు మాట్లాడతారు.
సృజనీ తన యూజర్లు, తమకు నచ్చిన భాషలో సమాచారాన్ని బ్లాగ్‌లుగా వెతకడం, వ్రాయడం మరియు షేర్ చేసుకునే సామర్థ్యాన్ని అందించడానికి కృషి చేస్తుంది.
సృజనీ తన వినియోగదారులకి ఒక సహజమైన భారతీయ భాషా టైపింగ్ టూల్ మరియు వాయిస్-ఆటోమేటెడ్ టూల్ (డిక్టేషన్ సాఫ్ట్‌వేర్)తో వారి ఆలోచనలని వారికి నచ్చిన భాషలో వ్యక్తీకరించడంలో సహాయం చేస్తుంది. ఇది అన్ని వయసుల ప్రతిభావంతులైన మరియు నిష్ణాతులైన ప్రాంతీయ భాషా రచయితలని ప్రోత్సహిస్తుంది, వారికి పరిశ్రమలోని ఆంగ్ల బ్లాగర్ల మధ్య ఎదిగే అవకాశం కల్పిస్తుంది. ఈ బ్లాగ్‌లు పాఠకులకి బాగా అర్ధమయ్యే భాషలో చాలా అవసరమైన సమాచారాన్ని పొందడంలో కూడా సృజనీ సహాయపడుతుంది.
సృజనీ మెషిన్ లెర్నింగ్, స్పీచ్ టు టెక్స్ట్ మరియు న్యాచురల్ లాంగ్వేజ్ అండర్ స్టాండింగ్ వంటి కృత్రిమ మేధస్సుతో నడిచే శక్తివంతమైన సాంకేతిక మూలంతో వస్తుంది. వాయిస్ ఆటోమేటెడ్ ఎస్.టి.టి మరియు స్వలేఖ్ - టైపింగ్ టూల్‌ని ఉపయోగించి రచయితలు తమ సమాచారాన్ని ఒడియా మరియు హిందీలో టైప్ లేదా డిక్టేట్ చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్ వీలు కల్పిస్తుంది. ఇది త్వరలో అన్ని 22 భారతీయ అధికారిక భాషలని సపోర్ట్ చేయడానికి కృషి చేస్తుంది.
బహుభాషా బ్లాగులని వ్రాయడంతోపాటు ఈ ప్లాట్‌ఫారమ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సెట్టింగ్‌లు కూడా అందిస్తుంది, ఇది సమాచారాన్ని ఆప్టిమైజ్ చేయడానికి మరియు మెరుగైన దృశ్యమానత ఆలాగే పాఠకులని ఆకర్షించడానికి సెర్చ్ ఇంజిన్ ప్రమాణాలకి అనుగుణంగా మార్చుకోవడానికి బ్లాగర్‌లకు వీలుకల్పిస్తుంది.
సృజనీ భారతదేశంలోని భాష-ప్రాధాన్యత మరియు మొబైల్-ప్రాధాన్యతా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి, ఇది అనేక విభాగాలని సపోర్ట్ చేసే బహుభాషా సమాచారాన్ని అన్వేషించడానికి, వ్రాయడానికి మరియు షేర్ చేయడానికి యూజర్లను ప్రోత్సహిస్తుంది.
సృజనీని బహుభాషా బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉపయోగించడం వలన వచ్చే ప్రతిఫలాలు జీవనోపాధిని సంపాదించడం కంటే చాలా ఎక్కువ, అందుకే దానిని అత్యంత ఇష్టపడే ప్లాట్‌ఫారమ్‌గా చేస్తుంది. ఇది ఔత్సాహిక ప్రాంతీయ భాషా రచయితలకి అవకాశాన్ని సృష్టిస్తుంది, ఇది వారి వాణి వినిపించడానికి మరియు సామాజిక ప్రశంసలు పొందటానికి వీలుకల్పిస్తుంది. ఎవరైనా విషయ సృష్టికర్తకిది నిజమైన ప్రతిఫలము.
ఈ ఫీచర్లతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లోని రచయితలతో సంభాషించడానికి మరియు వారితో ఆలోచనలు పంచుకోవడానికి కూడా, ఇది పాఠకులకి వీలు కల్పిస్తుంది మరియు ఇరువైపులా సానుకూల వృద్ధిని ప్రోత్సహించే కొత్త విధానాలకి బాట వేయడానికి సాధ్యమవుతుంది.